Minister Amarnath on Three Capitals: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని ఆ రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో విశాఖను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్మెంట్ మీట్ నిర్వహిస్తామన్నారు. విశాఖలో భూ అక్రమాల ఆరోపణలను తెదేపా నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన: అమర్‌నాథ్ - Vishaka capital breaking
Minister Amarnath on Three Capitals: ఏపీలో అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు రెండో విడత మహా పాదయాత్ర చేపట్టారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని వైసీపీ నేతలు.. విశాఖ నుంచి వచ్చే ఏడాది నుంచి పరిపాలన కొనసాగిస్తామని చెబుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
VJA Minister Amarnath on Vishaka capital breaking
ఈ క్రమంలోనే అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా? అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. విశాఖలో రాజధానికి ప్రైవేట్ భూమి సెంటు కూడా తీసుకోలేదని తెలిపారు. రైతుల పాదయాత్రలో విశాఖలో ఏం జరిగినా చంద్రబాబే బాధ్యత వహించాలని మంత్రి అమర్‌నాథ్ సూచించారు.
ఇవీ చదవండి: