ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని 25వ డివిజన్ శనివారపుపేటలోని ఎంపీపీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆళ్ల నాని వెళ్లారు. పోలింగ్ బూత్‌లోకి ఓటేసేందుకు వెళ్లగా అక్కడ ఆయన ఓటు కనిపించలేదు.
డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు మిస్సింగ్.!
ఏపీ పురపాలిక ఎన్నికల్లో డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి చుక్కెదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని 25వ డివిజన్‌లో ఓటేసేందుకు వెళ్లిన ఆయనకు.. ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో అధికారులను ప్రశ్నించారు. చివరకు ఓటేయకుండానే ఆళ్ల నాని వెనుదిరిగారు.
పురపాలిక ఎన్నికలు, ఏపీ మంత్రి ఆళ్ల నాని
డిప్యూటీ సీఎం ఓటు బదులు మరొక మహిళ పేరు మీద ఓటు ఉండటంతో అధికారులను ఆయన ప్రశ్నించారు. తన ఓటు ఏమైందని పోలింగ్ అధికారుల దగ్గర ఆరా తీశారు. చివరకు ఎక్కడా పేరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
ఇదీ చదవండి:'వచ్చే నెల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం'
Last Updated : Mar 10, 2021, 2:41 PM IST