ఏపీలో ఒక నెల రోజుల పాటు ఒక పూట మాత్రమే పాఠశాలలను నిర్వహిస్తామని, తరువాత పరిస్థితి దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. ఇది వరకే విద్యార్థులకు బ్యాగులు, యూనిఫారాలు, పుస్తకాలన్నింటినీ సరఫరా చేశామన్నారు.
కడప కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. పారదర్శకంగా, నిజాయితీ, జవాబుదారీతనంతో పని చేయాలనే.. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆశయాలను అమలు చేయాలన్నారు.