Minister Suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయపు నడకకు వెళ్లిమ మంత్రి ఒక్కసారిగా కిందపడిపోయారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఉన్న తన కళాశాలలో ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో వైద్యులు వెంటనే కళాశాలకు చేరుకుని సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఆయన కిందపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కళాశాలలోనే మంత్రి సురేశ్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
Minister Suresh: వాకింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన మంత్రి.. - మంత్రి ఆదిమూలపు సురేశ్ కు అస్వస్థత
Minister Suresh: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం తన కళాశాలలో.. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన మంత్రి ఒక్కసారిగా కుప్పకూలారు. విషయం తెలుసుకున్న వైద్యులు అక్కడకు చేరుకుని చికిత్స అందించారు.
minister-adimulapu-suresh-fell-ill
కాగా.. కొన్ని రోజుల క్రితం మంత్రి సురేశ్ అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి స్టంట్ వేశారు. ఆ తర్వాత ఇంటికొచ్చిన సురేశ్ ఇప్పుడు మరోసారి అస్వస్థకు గురయ్యారు.
ఇవీ చూడండి: