రాష్ట్రంలో మినీ పురపోరు ప్రక్రియ పూర్తైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలకు మేయర్, డిప్యూటీ మేయర్... సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ముగిసింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరోక్ష ఎన్నిక కోసం ఆయా పాలకమండళ్ల ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
కరోనా పాజిటివ్ నిర్ధారణై హోంక్వారంటైన్లో ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేసేందుకు, ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. మొత్తం 17 మంది ఈ విధానంలో ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్లో తొమ్మిది మంది, ఖమ్మంలో ముగ్గురు కార్పొరేటర్లు, అచ్చంపేటలో నలుగురు, కొత్తూరులో ఒక కార్పొరేటర్ వీడియో కాల్ ద్వారా ప్రమాణస్వీకారం చేశారు.