జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సంఖ్యా బలం 54 వరకు ఉంది. ఇందులో కార్పొరేటర్లు 44 మంది, ఎక్స్ అఫిసియో సభ్యులు 10 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మద్దతు రాకపోవడం వల్ల ఎంఐఎం పాత్ర కీలకంగా మారింది. ఎంఐఎం పార్టీ ఎలాగు భాజపాకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు. అటు తెరాసకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేదు.. అలాగని వ్యతిరేకంగా ఓటు కూడా వేయలేదు. ఈ నేపథ్యంలో వీలైతే... జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎంఐఎం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మేయర్ ఎన్నికలో కీలకంగా పతంగి... అసలు వ్యూహమేంటి? - ghmc mayor election updates
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో మజ్లిస్ పార్టీ పాత్ర కీలకంగా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ల విషయంలో వ్యూహాత్మకంగా ఉండాలని మజ్లిస్ పార్టీ నిర్ణయించింది. ఇదే విషయానికి సంబంధించి దారుస్సలాంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశమయ్యారు.
mim party plan on ghmc mayor election
మేయర్ ఎన్నికకు ముందుగా జరుగనున్న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరణకు హాజరై... అనంతరం మేయర్ ఎన్నిక కోసం జరిగే ప్రత్యేక సమావేశం నుంచి నేరుగా వైదొలగాలా...? లేక ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావాలా...? అనే అంశంపై ఎంఐఎం పార్టీలో చర్చ జరుగుతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో అవలంభించే వ్యూహంపై...దారుస్సలాంలో కార్పొరేటర్లతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశమయ్యారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:హాలియాలో సీఎం కేసీఆర్ ప్రసంగం హైలైట్స్
Last Updated : Feb 11, 2021, 10:16 AM IST