గ్రేటర్ ఎన్నికల్లో కొన్ని పార్టీలు హైదరాబాద్ నగర మతసామరస్యాన్ని చెడగొట్టేందుకు యత్నిస్తున్నాయని, ఆ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. ప్రచారంలో భాగంగా రెడ్‌హిల్స్ డివిజన్ పరిధిలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఏసీ గార్డ్స్ నుంచి ప్రారంభమైన రోడ్‌షో, బజార్‌ఘాట్, విజయ్‌నగర్ కాలనీ, నాంపల్లి మీదుగా సాగింది. నిరంతరం ప్రజల సమస్యల కోసం పాటుపడే ఎంఐఎం అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ఓవైసీ కోరారు.
'గ్రేటర్లో మతసామరస్యాన్ని చెడగొట్టేందుకు యత్నిస్తున్నారు' - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రచారం
హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్ డివిజన్ పరిధిలో ఎంఐఎం ప్రచారం నిర్వహించారు. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్‌తో కలిసి అక్బరుద్దీన్ ఓవైసీ రోడ్‌షోలో పాల్గొన్నారు. నిరంతరం ప్రజల సమస్యల కోసం పాటుపడే మజ్లిస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ఓవైసీ కోరారు.
mim mla akbaruddin owaisi campaign in old city
అనాదిగా హైదరాబాద్ నగరం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని... భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుందని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. భారతదేశం ఏ ఒక మతం వారిది కాదని... హిందు, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లకు సమాన హక్కు ఉందన్నారు. సమాజంలో అశాంతిని రేకెత్తించి ఓట్లు పొందేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ ఒకటిన జరిగే పోలింగ్‌లో విధిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.