తెలంగాణ

telangana

ETV Bharat / city

'తాత్కాలిక పండ్ల మార్కెట్​ కోసం వక్ఫ్​ బోర్డు స్థలాలిచ్చేందుకు సిద్ధం..' - నూతన పండ్ల మార్కెట్​

నూతన పండ్ల మార్కెట్​ నిర్మాణమయ్యే వరకు వ్యాపారుల కోసం తాత్కాలిక మార్కెట్​ నిర్మించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ కోరారు. అందుకోసం వక్ఫ్​ బోర్డు తరఫున 30 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సభలో స్పష్టం చేశారు.

MIM MLA akbaruddin owaisi About temporary fruit market in hyderabad
MIM MLA akbaruddin owaisi About temporary fruit market in hyderabad

By

Published : Mar 12, 2022, 5:35 PM IST

'తాత్కాలిక పండ్ల మార్కెట్​ కోసం వక్ఫ్​ బోర్డు స్థలాలిచ్చేందుకు సిద్ధం..'

కొత్తపేట పండ్ల మార్కెట్‌ స్థలంలో ఆసుపత్రి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. కొత్తపేట పండ్ల మార్కెట్‌ కూల్చివేతపై అసెంబ్లీలో ప్రస్తావన రాగా.. దానిపై అక్బరుద్దీన్​ స్పందించారు. పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా వ‌క్ఫ్‌ బోర్డు స్థలంలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజన్‌ సమీపిస్తున్న సమయంలో మార్కెట్‌ను అర్థాంతరంగా కూల్చటంతో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు రోడ్డున పడ్డారని అక్బరుద్దీన్‌ తెలిపారు.

"ఆసపత్రి నిర్మాణానికి మేం ఎంత మాత్రం వ్యతిరేకం కాదు. గతంలో సీఎం కేసీఆర్​ను కలిసినప్పుడు ఆయన ముందు ఓ ప్రతిపాదన కూడా పెట్టాను. పండ్ల మార్కెట్​ను వక్ఫ్​ బోర్డు స్థలంలో పెట్టాలని కోరాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. కొత్త పండ్ల మార్కెట్​ కచ్చితంగా నిర్మించండి. రెండేళ్లలో తాత్కాలిక మార్కెట్​ నుంచి కొత్త మార్కెట్​లోకి మారుతుందని పండ్ల వ్యాపారులకు నేను రాసిస్తా. కాని.. అప్పటిదాకా వ్యాపారులంతా రోడ్ల మీద ఉంటారు. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్​.. వాళ్లంతా రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకుంటున్నారు. పోలీసులొచ్చి పండ్లను సీజ్​ చేస్తున్నారు. ఆస్పత్రి ముఖ్యమే.. కానీ.. ఈ నిరుపేదల గురించి కూడా కొంచెం ఆలోచించండి. తాత్కాలిక మార్కెట్​ కోసం వక్ఫ్​ బోర్డు స్థలం 30 ఎకరాలు మేం ఇస్తాం. తాత్కాలిక షెడ్లు నిర్మించుకునేందుకు వ్యాపారులు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ల గురించి కొంచెం ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా." - అక్బరుద్దీన్‌ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details