సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిశాల గ్రామ పరిధిలో నిర్మాణ రంగంలో పని చేస్తున్న వలస కార్మికులు పెద్ద ఎత్తున మండల తహశీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. తమను స్వస్థలాలకు పంపాలని, కేంద్రం అనుమతులు ఇచ్చినా ఎందుకు పంపడం లేదని అధికారులను ప్రశ్నించారు. తమ యజమాని పనిచేసిన డబ్బులు కూడా ఇవ్వలేదని.. తిండికి కూడా చాలా ఇబ్బంది అవుతుందని అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వలస కూలీలతో మాట్లాడిన అధికారులు కూలీ డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వలస కార్మికులను పంపేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ఆదేశాలు రాగానే వెంటనే తరలిస్తామని తహశీల్దార్ శివకుమార్ వలస కార్మికులకు నచ్చజెప్పారు.
తహశీల్దార్ కార్యాలయానికి వలస కార్మికుల తాకిడి - Migration Labor protest At Ramachandra Puram Tahashil Office
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక.. చేతిలో డబ్బులు లేక.. రవాణా లేక ఇబ్బంది పడుతున్నామని.. తమను స్వస్థలాలకు పంపాలని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల తహశీల్దార్ కార్యాలయానికి పెద్ద ఎత్తున వలస కార్మికులు తరలివచ్చారు.

స్వస్థలాలకు పంపాలని తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన వలస కార్మికులు