శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోరైలు ప్రాజెక్టు(Metro service to Rajiv Gandhi International Airport)ను విస్తరించనున్నారు. రూ.5,195 కోట్ల అంచనాతో చేపడుతున్న ‘ఎయిర్‌పోర్టు మెట్రో లింక్’ ప్రాజెక్టులో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూపు 10 శాతం (రూ.519.52 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.మెట్రోరైలు రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్ మెట్రోని తెలంగాణ ప్రభుత్వం మూడున్నరేళ్ల క్రితం ప్రతిపాదించింది. ఈ మార్గం అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ, కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఎయిర్‌పోర్ట్ మెట్రో లింక్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకి 51 శాతం, హెచ్‌ఎండీఏకి 49 శాతం వాటాగా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో జీఎంఆర్ రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఏడాదికి 3.2 కోట్ల మంది ప్రయాణించేలా విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూప్ విస్తరిస్తోంది.
లోపలే మూడు స్టేషన్లు :