తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి నగరంలో మెట్రో రైలు సేవలు పునః ప్రారంభం - హైదరాబాద్​లో మెట్రో సేవలు ప్రారంభం

మహారాష్ట్ర మినహా దేశవ్యాప్తంగా... నేటి నంచి మెట్రో రైలు సేవలు పునః ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రైల్లలో, స్టేషన్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్​లో మియాపూర్​ నుంచి ఎల్బీ నగర్​ మార్గంలో సేవలు ప్రారంభించనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

metro services restart in hyderabad today onwards
నేటి నుంచి నగరంలో మెట్రో రైలు సేవలు పునః ప్రారంభం

By

Published : Sep 7, 2020, 3:35 AM IST

నేటి నుంచి నగరంలో మెట్రో రైలు సేవలు పునః ప్రారంభం

లాక్ డౌన్ కారణంగా మూతపడిన మెట్రో రైళ్లు... దేశవ్యాప్తంగా నేటి నుంచి దశల వారీగా పునః ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర మినహా మిగిలిన ప్రాంతాల్లో మెట్రో సేవలు పునరుద్ధరించారు. హైదరాబాద్ లో... మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మార్గంలో ఈ రోజు సేవలు ప్రారంభం కానుండగా... రేపు నాగోల్ నుంచి రాయదుర్గం, బుధవారం జేబీఎస్-ఎంజీబీఎస్​ మార్గాల్లో మెట్రో రైళ్లు నడపనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు... తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే రైళ్లు నడుస్తాయని... హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న... గాంధీ ఆసుపత్రి, భరత్​నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసుఫ్ గూడ స్టేషన్లలో మెట్రో ఆగదని స్పష్టం చేశారు. ప్రయాణికులను... థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే... లోపలికి అనుమతించనున్నారు. స్టేషన్లలో టోకెన్ల ప్రక్రియను పూర్తిగా రద్దుచేసి... స్మార్ట్ కార్డు, ఆన్​లైన్ బుకింగ్ ద్వారా ప్రయాణించే అవకాశం కల్పించారు. మెట్రో సిబ్బందికి... పీపీఈ కిట్లు సమకూర్చారు. సీటింగ్ విధానంలో కూడా మార్పులు చేసి, ప్రతి బోగీలో ప్రయాణికులు నిల్చునే, కూర్చునే చోట... మార్కింగ్ చేశారు.

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

ABOUT THE AUTHOR

...view details