అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద జరిగిన ప్రమాదంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. మెట్రోస్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడిపడిన శకలాలతో ఒక యువతి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. అంత పైనుంచి ఆమె తలపై నేరుగా పడడం మరణానికి కారణమైందన్నారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పరిష్కార చర్యలు తీసుకోవడానికి స్వతంత్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రమాదాలు నివారించడానికి అన్ని మెట్రో స్టేషన్ స్తంభాలతో పాటు ఉపరితలాలను పూర్తిగా తనిఖీ చేయమని ఎల్ అండ్ టీకి సూచించామని తెలిపారు.
ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ - Metro_Md_On_Accident
అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద జరిగిన ప్రమాదంపై మెట్రో ఎండీ స్పందించారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించి, పరిష్కార చర్యలు తీసుకోవడానికకి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ
Last Updated : Sep 23, 2019, 7:21 AM IST