ఉత్తర అండమాన్ సముద్రంలో అక్టోబరు 10న అల్పపీడనం(Today Weather Update in AP) ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. తర్వాత నాలుగైదు రోజుల్లో అది మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశలో కదులుతూ.. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాల వైపు ప్రయాణిస్తుందని వెల్లడించారు.
Today Weather Update in AP : అండమాన్‌లో మరో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్లో... - ap news 2021'
ఉత్తర అండమాన్ సముద్రంలో అక్టోబర్ 10న అల్పపీడనం(Today Weather Update in AP) ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఏపీలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వానలు కురవచ్చని వెల్లడించారు.
ఏపీలో మోస్తరు వర్షం
‘తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం(Today Weather Update in AP) నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో(Rain updates in AP) ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చు’ అని చెప్పారు.