చెరుకు రైతుల సంక్షేమం కోసం విశేష కృషిచేసిన గుత్తా జీకేనాయుడు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశాన్ని పంపించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా నిండ్ర మండలానికి చెందిన గుత్తా జీకేనాయుడు జీవిత పర్యంతం రైతు సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని వెంకయ్యనాయుడు కొనియాడారు.
గుత్తా జీకేనాయుడు మృతి పట్ల వెంకయ్యనాయుడు సంతాపం - Chittoor District Latest News
చెరుకు రైతుల సంక్షేమం కోసం విశేష కృషిచేసిన గుత్తా జీకేనాయుడు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశాన్ని పంపించారు. భావితరాలు జీకేనాయుడి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని.. రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని ఉపరాష్ట్రతి పిలుపునిచ్చారు.
జీకేనాయుడు మృతిపట్ల ఉపరాష్ట్రపతి సంతాపం
సర్పంచ్ పదవి మొదలుకుని చక్కెర కర్మాగారాలను ప్రారంభించేలా చేయటం వరకూ... చెరుకు రైతుల కోసం ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శప్రాయమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. జీకేనాయుడు చేసిన సేవలను స్మరిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. భావితరాలు జీకేనాయుడి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని... రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండీ :Lock down: ఈ నెల 20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం