కేసీఆర్ అధికారం ఉందన్న ధీమాతో దురహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు అన్నారు. హైదరాబాద్ రాణిగంజ్ డిపో 1, 2లో ఆర్టీసీ కార్మికులు అర్థరాత్రి నుంచి ధర్నా చేస్తున్నారు. సమ్మెలో ఉన్న కార్మికులకు సీఎం డెడ్లైన్ పెట్టి మానసికంగా హింసిస్తున్నారని ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో పాటు... మిగిలిన 26 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 20 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. సమ్మె కొనసాగుతుందని.. విధుల్లో చేరడం లేదని తెలిపారు.
డెడ్లైన్ పెట్టి మానసికంగా హింసిస్తున్నారు: ఆర్టీసీ ఐకాస నేతలు - tsrtc strike updates
హైదరాబాద్ రాణిగంజ్ డిపో 1, 2 పరిధిలో అర్థరాత్రి నుంచి కార్మికులు ధర్నా చేస్తున్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయటంతో పాటు... మిగిలిన 26 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. 20 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యకు పాల్పడినా ప్రభుత్వం కళ్లు తెరవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డెడ్లైన్ పెట్టి మానసికంగా హింసిస్తున్నారు:ఆర్టీసీ ఐకాస నేతలు