తెలంగాణ

telangana

ETV Bharat / city

రెచ్చిపోయిన మానసిక రోగి.. ఇద్దరిపై కత్తి, సుత్తెతో దాడి - విశాకలో కత్తిని దించి పనిచేపించుకున్నాడు

ఓ మానసిక రోగి ఓ మోకానిక్​పై దాడి చేశాడు. మరొకరి తలపై సుత్తితో కొట్టాడు. అంతే కాదు బాధితుడి నుంచి మళ్లీ కత్తిని బయటకు తీసే క్రమంలో దాని పిడి భాగం విరిగిపోయి, మిగతా భాగం వీపులో ఉండిపోయింది. మెకానిక్‌ తీవ్రంగా గాయపడినా వదలకుండా తన ద్విచక్ర వాహనానికి అతనితో అరగంట పాటు మరమ్మతులు చేయించాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖ బుచ్చిరాజుపాలెంలో జరిగింది.

మానసిక వ్యాధిగ్రస్థుడి బీభత్సం.. మెకానిక్​పై దాడి
మానసిక వ్యాధిగ్రస్థుడి బీభత్సం.. మెకానిక్​పై దాడి

By

Published : Dec 15, 2020, 1:15 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ బుచ్చిరాజుపాలెంలో... మానసిక స్థితి సక్రమంగా లేని ఒక వ్యక్తి కత్తి, సుత్తితో ఇద్దరు వ్యక్తుల్ని గాయపరిచాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. పైడిమాంబ కాలనీకి చెందిన విజయకుమార్‌ (27) హెవీ వెహికల్‌ డ్రైవర్‌. కొంతకాలంగా అతని మానసిక స్థితి సక్రమంగా లేక ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. సోమవారం సాయంత్రం తన పాత ద్విచక్ర వాహనాన్ని బుచ్చిరాజుపాలెం గ్యాస్‌ గోదాము పక్కనే ఉన్న మెకానిక్‌ కృష్ణ (24) వద్దకు తెచ్చి బాగు చేయాలన్నాడు.

అప్పటికే మరొకటి మరమ్మతులు చేస్తుండటంతో, కాసేపు ఆగాలన్నాడు. దీంతో ఆగ్రహించిన విజయకుమార్‌ తన వద్ద ఉన్న పదునైన కత్తితో కృష్ణ వీపు భాగంలో గట్టిగా పొడిచాడు. మళ్లీ కత్తిని బయటకు తీసే క్రమంలో దాని పిడి భాగం విరిగిపోయి, మిగతా భాగం వీపులో ఉండిపోయింది. అటుగా వెళ్తున్న మెకానిక్‌ స్నేహితుడు షేక్‌ గౌస్‌ (23) ఏమైందని అడిగే క్రమంలో అక్కడే ఉన్న సుత్తితో అతడి తలపై గట్టిగా కొట్టాడు విజయకుమార్‌. తీవ్ర రక్తస్రావంతో అతడు భయంతో పరుగులు తీశాడు. మరో వైపు మెకానిక్‌ కృష్ణ తీవ్రంగా గాయపడినా వదలకుండా తన ద్విచక్ర వాహనానికి విజయకుమార్‌ అరగంట పాటు మరమ్మతులు చేయించాడు. ఈలోగా స్థానికులకు ఈ విషయం తెలియడంతో అతడిని పట్టుకున్నారు. కృష్ణను, గౌస్‌ను 108లో ఆసుపత్రికి తరలించారు. ఎయిర్‌పోర్టు సీఐ సి.హెచ్‌.ఉమాకాంత్‌ స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. విజయకుమార్‌ను కుటుంబ సభ్యుల సమక్షంలో విచారించారు. కేసు నమోదు చేశారు.


ఇదీ చదవండి:'జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details