తెలంగాణ

telangana

ETV Bharat / city

హోలీ ప్రత్యేకం: ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు! - హోలీ రోజున ఏపీలో వింత ఆచారం

హోలీ అంటే.. కాముని దహనం, రంగులు చల్లుకోవడం.. ఇదే కదా..! కానీ అక్కడ మాత్రం ప్రత్యేకం. ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. హోలీ వచ్చిందంటే చాలు.. జంబలకిడిపంబ సినిమా తరహాలో మగాళ్లు ఆడవాళ్లైపోతారు. తమ కోర్కెలు నెరవేరేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు.

holi celebrations in telangana
జంబలకిడిపంబ సినిమా తరహాలో హాలీ సంబురాలు

By

Published : Mar 28, 2021, 8:41 PM IST

ఏపీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే.. జంబలకిడిపంబ సినిమా తరహాలో వింత ఆచారం కొనసాగుతోంది. తరతరాల నుంచి ఓ సంప్రదాయం నడుస్తోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని.. మహిళ్లలా సింగారించుకుంటారు. రతీ మన్మథుడికి పూజలు చేస్తారు.

చీరలు కట్టుకుని, నగలు, పూలతో సింగారించుకొంటారు. హోలీ సందర్భంగా తమ గ్రామంలో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఇలా చేస్తారు. ఇక్కడికి కర్ణాటక రాష్ట్రం నుంచీ చాలామంది వస్తారు. పురుషులు ఆడవాళ్ల మాదిరిగా వేషధారణ చేసుకుని పూజిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని వారి నమ్మకం.

ఇలా పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని.. ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయని అక్కడి వారి నమ్మకం. ఏటా.. హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వింత ఆచారాన్ని చూడడానికి భారీ ఎత్తున తరలివస్తారు.

హోలీ ప్రత్యేకం: ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు

ఇవీచూడండి:కొత్త వసంతానికి స్వాగతం పలికే హోలీ.. కరోనా దృష్ట్యా సాదాసీదాగానే!

ABOUT THE AUTHOR

...view details