గోవుల అక్రమ రవాణా నిలువరించటానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న గోవులను యుగతులసి ఫౌండేషన్, శ్రీ రామ యువసేన సభ్యులు సంయుక్తంగా పట్టుకుని పోలీసులకి అప్పగించారు.
125 గోవులను రక్షించిన యుగ తులసి ఫౌండేషన్ - గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న యుగతులసి ఫౌండేషన్
గోవుల అక్రమ రవాణాను యుగతులసి ఫౌండేషన్, శ్రీరామ యువసేన సభ్యులు అడ్డుకున్నారు. దాదాపు 125 గోవులను రక్షించారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని పోలీసులకి అప్పగించారు.
125 గోవులను రక్షించిన యుగ తులసి ఫౌండేషన్
బీబీ నగర్, ఘట్‌కేసర్, రాజేంద్ర నగర్ పరిధిలో మూడు డీసీఎం వాహనాల్లో తరలిస్తుండగా అడ్డుకున్నట్లు శివ కుమార్ తెలిపారు. దాదాపు 125 ఆవులను రక్షించినట్లు వెల్లడించారు. వీటిని చల్లూరు, యాదాద్రి, గగన్‌పహాడ్‌లోని గోశాలలకు తీసుకువెళ్లినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:'ఉద్యోగుల శ్రమతో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ'