సీఎం కేసీఆర్‌కు బాలాపూర్ లడ్డూ అందజేత - సీఎం కేసీఆర్‌కు బాలాపూర్ లడ్డు అందజేత
15:03 September 03
బాలాపూర్ లడ్డూను సీఎం కేసీఆర్‌కు అందించిన గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు
గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు బాలాపూర్ లడ్డూను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో లడ్డూను కేసీఆర్‌కు ఇచ్చారు.
బాలాపూర్ గణేశుడి లడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 26 సంవత్సరాల క్రితం 450కి మొదలైన లడ్డు వేలం... గత సంవత్సరం 17 లక్షల 60 వేలకు కోలన్ బ్రదర్స్ కైవసం చేసుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా .. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంపాటను నిర్వాహకులు రద్దు చేశారు.