తెలంగాణ

telangana

ETV Bharat / city

CPI Narayana: రాష్ట్రంలో బంగాల్​ తరహా రాజకీయ పరిణామాలు జరిగే ప్రమాదం ఉంది: నారాయణ - సీపీఐ తెలంగాణ తాజా వార్తలు

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ అన్నారు. రాష్ట్రంలో పశ్చిమ బంగాల్​ తరహా రాజకీయ పరిణామాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

cpi narayana comment on etala rajender
మాజీ మంత్రి ఈటలపై సీపీఐ నారాయణ కామెంట్స్

By

Published : Jun 14, 2021, 5:47 PM IST

Updated : Jun 14, 2021, 6:32 PM IST

రాష్ట్రంలో పశ్చిమ బంగాల్​ తరహా రాజకీయ పరిణామాలు జరిగే ప్రమాదం ఉందని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భారతీయ జనతా పార్టీలో చేరడంపై స్పందించిన ఆయన ఈటల చేరికను రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు.

మాజీ మంత్రి ఈటలపై సీపీఐ నారాయణ కామెంట్స్

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రంలో కూడా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని నారాయణ ఆరోపించారు. బంగాల్​లో భాజపా, తృణముల్​ కాంగ్రెస్​ల మధ్య జరిగిన పోరులాంటిదే రాష్ట్రంలోనూ జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా మేల్కోకపోతే వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:HARISH RAO: రాజకీయ కుట్రలను ప్రజలు గమనించాలి: మంత్రి హరీశ్

Last Updated : Jun 14, 2021, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details