తెలంగాణ

telangana

ETV Bharat / city

సిట్టింగ్ కార్పొరేటర్ నిర్లక్ష్యం చేశారు: గోపాలకృష్ణ - telangana politics

సిట్టింగ్ కార్పొరేటర్ నిర్లక్ష్యం వల్ల మెహదీపట్నం డివిజన్లోని పలు కాలనీల ప్రజలు కష్టాలు పడుతున్నారని భాజపా కార్పొరేటర్ అభ్యర్థి గోపాలకృష్ణ ఆరోపించారు. తనను గెలిపించి అవకాశమిస్తే అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

సిట్టింగ్ కార్పొరేటర్ నిర్లక్ష్యం చేశారు: భాజపా గోపాలకృష్ణ
సిట్టింగ్ కార్పొరేటర్ నిర్లక్ష్యం చేశారు: భాజపా గోపాలకృష్ణ

By

Published : Nov 23, 2020, 4:45 PM IST

మెహదీపట్నం డివిజన్లో అనేక సమస్యలతో కాలనీవాసులు సతమతమవుతున్నారని... సిట్టింగ్ కార్పొరేటర్ ఏ మాత్రం పట్టించుకోలేదని మెహదీపట్నం డివిజన్ బీజేపీ అభ్యర్థి ఆరోపించారు. చిన్న చిన్న సమస్యలకు సైతం వెంటపడి చేయించుకోవాల్సి వస్తోందన్నారు. తనని గెలిపిస్తే సదా ప్రజాసేవలో ఉంటానని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. అభ్యర్థులు ఓటు వేసే సమయంలో వారి విద్యార్హతలు కూడా చూసి వేయాలని కోరారు. స్థానిక సమస్యల పైన కూడా మంచి అవగాహన ఉందని... తనను గెలిపిస్తే కాలనీవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

సిట్టింగ్ కార్పొరేటర్ నిర్లక్ష్యం చేశారు: భాజపా గోపాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details