మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న మెగాస్టార్.. 'గాడ్ ఫాదర్' షూటింగ్లో పాల్గొంటున్నారు. మలయాళీ బ్లాక్‌బస్టర్ చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు మోహన్‌రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
chiranjeevi: 'జన జాగృతి పార్టీ'తో మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి..!? - 'జన జాగృతి పార్టీ'తో మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి..!?
07:30 February 08
chiranjeevi: 'జన జాగృతి పార్టీ'తో మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి..!?
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరు 'జన జాగృతి పార్టీ'లో చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మెగాస్టార్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా అంటూ చర్చ మొదలైంది. అయితే ఇందులో నిజం లేదు. గాడ్ ఫాదర్ చిత్రంలో కథపరంగా చిరంజీవి ఓ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఆ పార్టీ పేరే 'జన జాగృతి పార్టీ'. ఇదీ అసలు సంగతి.
గాడ్‌ఫాదర్ తర్వాత చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడిగా తమన్నా నటిస్తోంది.
ఇదీ చూడండి: 'గాడ్ ఫాదర్' సెట్లో చిరు.. స్క్రిప్ట్ పనుల్లో పవర్‌స్టార్
TAGGED:
chiru