ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. ఆ పరిశ్రమ ఆంధ్రుల త్యాగాలకు గుర్తు అని అన్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ మద్దతు - protest against vizag steel plant privatization
ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు కార్మాగారాన్ని కాపాడుకుందామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా పోరాడాలన్నారు. ఈ మేరకు ఏపీలో జరుగుతున్న ఉద్యమానికి ట్విటర్ వేదికగా మద్దతు ప్రకటించారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ మద్దతు
విశాఖ ఉక్కు రక్షణకు ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పోరాడాలని చిరంజీవి అన్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీలకతీతంగా కలిసి రావాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:బడ్జెట్ సమావేశాలకు తగు నివేదికలతో సిద్ధం కావాలి: సీఎస్