నెల్లూరు నగరంలోని జగదీశ్ నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌కు మొక్కలంటే పంచప్రాణాలు. 265 చదరపు గజాల ఇంటిలోనే 2000 మొక్కలు పెంచుతూ ఉద్యానవనంలా మార్చేశారు. దేశవిదేశాల నుంచి మొక్కలు తెప్పించుకుని అపురూపంగా చూసుకుంటున్నారు. విద్యాశాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నప్పటికీ మొక్కల పెంపకానికి రోజులో 5 గంటల సమయం కేటాయిస్తారు. 35 ఏళ్లుగా తమకు ఇది నిత్యకృత్యమని ఆయన అంటున్నారు.
మొక్కలకుదేశ విదేశాల నుంచిఎరువులు
చంద్రశేఖర్ తన ఇంట్లో మొత్తం 200 రకాలు మొక్కలు పెంచుతున్నారు. నీటితామర, సువాసనలు వెదజల్లే అజేలియా పుష్పాలు, థాయ్‌ల్యాండ్, జపాన్, హవాయి ద్వీపాల నుంచి తెచ్చిన మెుక్కలు, ఎడారి మొక్కలు, మరుగుజ్జు చెట్లు ఇలా వివిధ రకాల మొక్కలతో ఇంటిని నింపేశారు. వీటిని సంరక్షించుకోవడానికి చంద్రశేఖర్ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఆన్ లైన్ ద్వారా పోషక ఎరువులు తెప్పిస్తారు. కేరళ విధానంలో కొబ్బరి పొట్టు కలిపిన ఎరువులు వేస్తున్నారు.