జూనియర్ వైద్యులు కరోనా బారిన పడుతున్నా.. వైద్యవిద్య పీజీ పరీక్షలను వాయిదా వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ విముఖత వ్యక్తం చేస్తోందని ఓ విద్యార్థి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీకి చెందిన ఉదయ్ తమ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాడు.
వైద్యవిద్య పీజీ పరీక్షలు వాయిదా వేయాలని గవర్నర్‌కు లేఖ - medical student wrote a letter to governor tamilisai
వైద్య విద్య పీజీ పరీక్షలను పోస్టుపోన్ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఓ వైద్యవిద్యార్థి లేఖ రాశాడు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తోన్న తాము వైరస్ బారిన పడుతున్నా.. పరీక్షలు వాయిదా వేయడం లేదని లేఖలో పేర్కొన్నాడు.

వైద్యవిద్య పీజీ పరీక్షలు వాయిదా వేయాలని గవర్నర్‌కు లేఖ
జూన్ 1 నుంచి తాను గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నానని, రెండ్రోజుల్లో డిశ్చార్జ్ కానున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. డిశ్చార్జైన తర్వాత రెండు వారాల పాటు హోంక్వారంటైన్లో ఉండాల్సిన అవసరముందన్న ఉదయ్.. ఈనెల 20 నుంచి జరిగే పీజీ పరీక్షలకు హాజరు కాలేకపోతానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలకు చదవడం కూడా కష్టమేనని తెలిపాడు. తనలాగే మరికొంత మంది వైద్య విద్యార్థులు కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమయంలో పరీక్షలను వాయిదా వేయాలని లేఖలో విజ్ఞప్తి చేశాడు.