తెలంగాణ

telangana

ETV Bharat / city

medical camp in sports school: 'జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రభుత్వ కృషి'

medical camp in sports school: హైదరాబాద్​ హకీంపేటలోని క్రీడా పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన నూతన వైద్య శిబిరాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటారు. మైదానాల్లో వివిధ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థుల క్రీడ నైపుణ్యాన్ని వీక్షించారు.

medical camp inauguration in sports school by minister srinivas goud
medical camp inauguration in sports school by minister srinivas goud

By

Published : Dec 4, 2021, 6:41 PM IST

medical camp in sports school: రాష్ట్రాన్ని క్రీడా హబ్​గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్​ హకీంపేటలోని క్రీడా పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన నూతన వైద్య శిబిరాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్​ను అందించారు. మంత్రులిద్దరు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటారు. మైదానాల్లో వివిధ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థుల క్రీడ నైపుణ్యాన్ని వీక్షించారు.

బీపీ చెక్​ చేపించుకుంటున్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​

క్రీడా పాఠశాలలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే.. రాణించే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. వైద్య శిబిరంలో అన్ని రకాల మందులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు కూడా చేసేందుకు వీలుగా పరికరాలను సిద్ధం చేశారన్నారు. క్రీడా పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బీపీ చెక్​ చేపించుకుంటున్న మంత్రి మల్లారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి నాణ్యమైన పౌష్టిక ఆహారంతో పాటు విద్యను అందిస్తూ క్రీడలలో ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. క్రీడా ప్రాతిపదికన ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. 9 కోట్లతో క్రీడా పాఠశాల అభివృద్ధికి, 13 కోట్లతో పాఠశాల ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

వైద్య పరీక్షలు చేపించుకుంటున్న మంత్రి మల్లారెడ్డి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details