మేడ్చల్ మండల సర్పంచ్‌లు ఎస్టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రతి నెలా నిధులు ఫ్రీజ్ చేయడం వల్ల పంచాయితీ సిబ్బంది పనులకు హజరుకావటం లేదని ఆరోపించారు. పేరుకి మాత్రమే సర్పంచ్‌లుగా ఉన్నామని... ఊర్లో మొహం ఎలా చూపించాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే... ఆత్మహత్యలే దారి అన్నారు.
అధికార పార్టీ అని భరించాం.. ఇక మా వల్ల కాదు: సర్పంచ్‌లు - ఆందోళన చేపడతామని సర్పంచ్ల హెచ్చరిక
ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల... పంచాయతీ సిబ్బంది విధులకు హాజరుకావడం లేదని మేడ్చల్ మండల సర్పంచ్‌లు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే... ఆత్మహత్యలే మార్గంగా కనిపిస్తున్నాయని వాపోయారు.
అధికార పార్టీ కాబట్టి భరించాం.. మా వల్ల కాదు: సర్పంచ్‌లు
ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు అందరం కలిసి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డి పర్యటనలో కూడా సర్పంచ్‌లు పాల్గొనకుండా నిరసన వ్యక్తం చేశారు. సొంత పార్టీ అయినందున ఇన్ని రోజులు భరించామని... ఇప్పుడు సహనం కోల్పోయామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:జాతికి వెలుగునిచ్చే చీకటి సూర్యులు సింగరేణి కార్మికులు: దత్తాత్రేయ