నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్ కౌన్సెలింగ్ - mbbs and bds councilling starts from today
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద ప్రవేశాల తొలివిడత వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద ప్రవేశాల తొలివిడత వెబ్కౌన్సిలింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలవరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రాధాన్యక్రమంలో వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ పేర్కొంది. దివ్యాంగ అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్‌సైట్లో పొందుపరిచామని, తొలివిడత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలంది. ప్రత్యేక కేటగిరీలైన ఎన్‌సీసీ, క్యాప్, ఈడబ్ల్యూఎస్ కోటాకు మరో ప్రకటన వెలువరిస్తామంది. వివరాలకు www.knruhs.in , www.knruhs.telangana.gov.inవెబ్‌సైట్లు సందర్శించాలని సూచించింది.
- ఇదీ చూడండి : ఈ నెలాఖరులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం