భవిష్యత్ అవసరాల దృష్ట్యా రహదారులను విస్తరించి అందుబాటులోకి తీసుకొస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ మిత్ర హిల్స్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు నిర్మిస్తున్న రహదారిని సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే గాంధీతో కలిసి పరిశీలించారు.
కరోనా వ్యాపిస్తున్నా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం: మేయర్ - కూకట్పల్లి నియోజకవర్గంలో మేయర్
కూకట్పల్లి నియోజకవర్గంలో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. హైదర్‌నగర్ మిత్ర హిల్స్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు నిర్మిస్తున్న రహదారిని ఎమ్మెల్యే గాంధీతో కలిసి పరిశీలించారు.
కరోనా వ్యాపిస్తున్నా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం: మేయర్
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా.. అనేక ఇబ్బందులను సైతం ఎదుర్కొని రోడ్ల విస్తరణ పనులను పూర్తి చేశామని వెల్లడించారు. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య నివారణకై నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేపట్టామని.. త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు