ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ఎంపీ సంతోష్‌కుమార్ ఇస్తున్న గ్రీన్ ఛాలెంజ్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటడం సంతోషం: మేయర్ - హెచ్‌ఎండీఏ పార్క్‌లో మొక్క నాటిన మేయర్ విజయలక్ష్మి
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మొక్కలు నాటారు. కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ఎంపీ సంతోష్ కుమార్ ఇస్తున్న గ్రీన్ ఛాలెంజ్‌కు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.
కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటడం సంతోషంగా ఉంది: మేయర్
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని హెచ్‌ఎండీఏ పార్కులో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి విజయలక్ష్మి మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం ద్వారా లక్షలాది మొక్కలు నాటుతూ... సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దానం తెలిపారు.
ఇదీ చూడండి:వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్