ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండడం, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అలజడి రేపుతుండడం వల్ల... పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. మావోల కదలికలను తెలుసుకునేందుకు వారు నిత్యం సంచరించే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.
దండకారణ్యంలో మావోల కదలికలు.. డ్రోన్‌కు చిక్కిన దృశ్యాలు - పోలీసులపై దాడికి మావోయిస్టుల ప్రణాళిక
పోలీసులపై దాడి చేసేందుకు మావోయిస్టులు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో గిరిజనులతో కలిసి పోలీసులపై దాడికి మావోయిస్టుల ప్రణాళిక వేసుకున్న డ్రోన్ దృశ్యాలు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి.
దండకారణ్యంలో మావోల కదలికలు.. డ్రోన్‌కు చిక్కిన దృశ్యాలు
ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం సుకుమా జిల్లా కిష్టారంపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాలోడు గ్రామం వద్ద మావోయిస్టులు అటవీ మార్గంలో వాగు దాటుతున్న దృశ్యాలు డ్రోన్ కెమెరాకు చిక్కాయి. సుమారు 200 మందికి పైగా మావోలు దట్టమైన అడవిలో నడుస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
Last Updated : Sep 15, 2020, 7:50 PM IST