తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రాలయంలో శ్రీరామ విగ్రహం ఏర్పాటుకు తరలిన భారీ శిల! - మంత్రాలయంలో శ్రీరామని విగ్రహం ఏర్పాటు

Masonry stone sent to mantralayam: ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో.. 52 అడుగుల శ్రీరాముని విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అనంతపురం జిల్లా రొళ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామ శివారులోని క్వారీ నుంచి భారీ రాతి శిలను వెలికి తీయించారు.

మంత్రాలయంలో శ్రీరామ విగ్రహం ఏర్పాటుకు తరలిన భారీ శిల!
మంత్రాలయంలో శ్రీరామ విగ్రహం ఏర్పాటుకు తరలిన భారీ శిల!

By

Published : Feb 20, 2022, 6:59 PM IST

మంత్రాలయంలో శ్రీరామ విగ్రహం ఏర్పాటుకు తరలిన భారీ శిల!

Masonry stone sent to mantralayam: ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో 52 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఏర్పాటు చేయాలని ఆలయాధికారులు నిర్ణయించారు. విగ్రహ తయారీ కోసం బెంగళూరుకు చెందిన అభయ రామమందిర సేవా ట్రస్టు వారు.. అనంతపురం జిల్లా రొళ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామ శివారులోని క్వారీ నుంచి పెద్ద రాతి శిలను వెలికి తీయించారు.

శ్రీరాముని విగ్రహ తయారీకిగానూ.. 430 టన్నుల బరువు, 15 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 18 అడుగుల ఎత్తుతో ఉన్న ఏక రాతి శిలను.. 136 చక్రాలు గల భారీ వాహనంలో మంత్రాలయానికి మేళతాళాలతో సాగనంపారు. ఈ రాతి శిల మంత్రాలయం చేరేందుకు నెల రోజుల సమయం పట్టవచ్చని సేవా ట్రస్టు సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details