తెలంగాణ

telangana

ETV Bharat / city

వివాహమైన 20 ఏళ్లకు మళ్లీ ప్రేమ.. పెళ్లి! - undefined

పదిహేడేళ్ల ప్రాయంలో ప్రేమించింది. పట్టుబట్టి మరీ అతడినే మనువాడింది. ఇప్పుడామెకు ఇద్దరు పిల్లలు. 18 ఏళ్ల కొడుకు, 15 ఏళ్ల కుమార్తె. ఇన్నేళ్ల తర్వాత ఆమెకు మళ్లీ ప్రేమ పుట్టింది. ఇష్టపడి పెళ్లాడిన భర్త, పెళ్లి చేయాల్సిన కొడుకు, పెళ్లీడుకొచ్చిన కూతురు.. ఇవేమీ తన కళ్లకు కనిపించలేదు. బంధాలన్నీ తెంచేసుకుని ఇంకొక అతనితో వెళ్లిపోయింది.

వివాహమైన 20 ఏళ్లకు మళ్లీ ప్రేమ.. పెళ్లి!

By

Published : Nov 18, 2019, 4:48 PM IST

Updated : Nov 18, 2019, 4:55 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇరవైఏళ్ల తరువాత మరొకరిని ప్రేమించింది. విడాకుల కోసం కట్టుకున్నవాడిని, పిల్లలను కాదని కోర్టుకెక్కింది. కోర్టులో విడాకులు లభించకముందే మరో పెళ్లి చేసుకుంది. ఈ ఉదంతంపై ఆమె మొదటి భర్త సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు సూచన మేరకు ఆమెపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్​లోని శ్రీకృష్ణానగర్‌ ప్రాంతానికి చెందిన అశోక్‌(42), ఒక యువతి 1999 మేలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. 2016లో ఖమ్మం జిల్లాకు చెందిన వేణుగోపాల్‌తో ఆమె మరోసారి ప్రేమలో పడింది. ఈ అంశంపై భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ వ్యవహారం కొలిక్కి రాకుండానే 2017లో ఖమ్మంలో వేణుగోపాల్‌ను ఆమె వివాహం చేసుకొందని, వారిరువురు భార్యాభర్తలమని చూపి ఇంటి రుణం సైతం తీసుకున్నారంటూ కోర్టును అశోక్‌ ఆశ్రయించగా.. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని బంజారాహిల్స్‌ పోలీసులకు కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి...ప్రేమ కోసం.. తల్లిని చంపి తండ్రిపైనే ఫిర్యాదు

Last Updated : Nov 18, 2019, 4:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details