ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పెళ్లింట కరోనా కలకలం రేపింది. పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటంతో పెళ్లి తంతును వాయిదా వేశారు. జ్వరం వచ్చిందనే అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఓ వ్యక్తి... ఫలితాలు రాకముందే పెళ్లికి సిద్ధమయ్యాడు. ముహూర్త సమయం సమీస్తుండగా పెళ్లి కొడుకును చేసే సమయంలో అతని ఫోన్‌కు కరోనా పాజిటివ్ అని సందేశం వచ్చింది. ఇంకేముంది పెళ్లి కొడుకును క్వారంటైన్‌కు తరలించి..వివాహాన్ని వాయిదా వేశారు. అప్పటి వరకూ పెళ్లి వేడుకలో పాల్గొన్న వారంతా భయాందోళనలతో పరీక్షలు చేయించుకుంటున్నారు.
కాసేపట్లో పెళ్లి... ఇంతలో 'పాజిటివ్' అంటూ సందేశం - కరోనాతో వివాహం వాయిదా వార్తలు
కాసేపట్లో పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మాయి, అబ్బాయి తరఫు బంధువులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. అయితే ఇంతలో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. వరుడికి పాజిటివ్ అంటూ ఫోన్‌కు సందేశం వచ్చింది.
కాసేపట్లో పెళ్లి... ఇంతలో 'పాజిటివ్' అంటూ సందేశం