Flood problems: ఏపీలోని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకలో.. ఓ వధువు ఇంట పెళ్లికి వరదతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పెళ్లి ముహూర్తం ఆగస్టు నెలలో పెట్టుకుంటే వరద కష్టాలు తప్పవని భావించి.. జులైలో ముహూర్తం పెట్టుకున్నారు. అయినా ముందుగానే వచ్చిన వరదలతో పెళ్లింట ఇబ్బందులు తప్పలేదు.
పెళ్లికి వరద కష్టాలు.. పడవలోనే ప్రయాణం.. చివరికి.. - ఏపీలో పోటేత్తిన వరదలు
Flood effect: ఆగస్టులో వర్షాలు వస్తాయని ఊహించి.. ఈ నెలలో పెళ్లి పెట్టుకున్నారు.. కానీ ఊహించని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలోనే వరదలొచ్చాయి. ముహూర్తం సమయం దగ్గరకొచ్చింది... వరదలు తగ్గలేదు.. దీంతో చేసేదేమీ లేక పడవల్లోనే బయల్దేరారు. ఇంతకీ అది ఎక్కడ చోటుచేసుకుందో మీరూ చూసేయండి..

పెళ్లికి వరద కష్టాలు
పెళ్లికి వరద కష్టాలు.. పడవలోనే ప్రయాణం
పెదపట్నం లంక గ్రామానికి చెందిన ప్రశాంతికి మలికిపురం మండలం తూర్పు పాలానికి చెందిన అశోక్‌కుమార్‌తో వివాహం నిశ్చయించారు. పెదపట్నం లంక గ్రామాన్ని వరద నీరు పూర్తిగా చుట్టుముట్టడంతో.. గ్రామం వెలుపల ఉన్న రహదారి వరకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో వధువు ప్రశాంతితో పాటు బంధువులు పడవల్లో ప్రయాణించి ఏటిగట్టు వరకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తూర్పుపాలెంలోని వరుడి ఇంటికి చేరుకున్నారు.
ఇవీ చదవండి: