ఏపీలోని గుంటూరులో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో ఓ జంట తమ 12వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. నగరానికి చెందిన విమల్ సాగర్, సంధ్యారాణి దంపతులకు కరోనా సోకగా కొద్ది రోజుల క్రితం ఈ కేంద్రానికి వచ్చారు. ఈలోగా వారి పెళ్లిరోజు వచ్చింది. అయితే వారిలో ధైర్యం నింపేందుకు కొవిడ్ కేర్ సెంటర్ నిర్వాహకులు ఓ కేకు తీసుకువచ్చి దంపతులతో కట్ చేయించారు.
కొవిడ్ కేంద్రంలో పెళ్లి రోజు వేడుకలు - ap news
ఆ దంపతులిద్దరూ కరోనా బారిన పడ్డారు. వారిద్దరూ ఓ కొవిడ్ సంరక్షణ కేంద్రంలో చేరారు. ఈలోగా వారి పెళ్లిరోజు వచ్చింది. కష్టకాలం కావటం వల్ల పెళ్లిరోజు వేడుకలు వద్దని అనుకున్నారు. అయితే వారిలో ధైర్యం నింపేందుకు కొవిడ్ కేర్ సెంటర్ నిర్వాహకులు ఓ కేకు తీసుకువచ్చి ఆ దంపతులతో కట్ చేయించారు. తోటి రోగుల సమక్షంలో పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నారు. ఏపీలోని గుంటూరులో సీపీఎం ఆధ్వరంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో ఈ వేడుకలు జరిగాయి.
marriage anniversary, covid center guntur
కుటుంబ సభ్యుల మధ్య జరపాల్సిన వేడుకని తోటి కొవిడ్ బాధితులతో కలిసి ఆనందోత్సహాల మధ్య నిర్వహించుకున్నారు. సాగర్, సంధ్య దంపతులకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర ఆత్మీయుల మధ్య సంబరాలు చేసుకోవటం ఆ దంపతులకు మంచి అనుభూతిని మిగిల్చింది.
ఇదీ చదవండి:రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం