సికింద్రాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గం బన్సీలాల్‌పేట్ డివిజన్లోని నీలం బాలయ్య దొడ్డి, సిద్ది లింగేశ్వర స్వామి ఆవరణలో ఇళ్లు కూల్చేసిన ప్రాంతాన్ని మర్రి శశిధర్ రెడ్డి సందర్శించారు. తప్పుడు పత్రాలతో వచ్చి ఇళ్లను కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మోసపూరితంగా నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని... వారికి మంత్రి తలసాని పూర్తి అండదండాలు ఉన్నాయని మర్రి ఆరోపించారు.
అక్రమార్కులకు మంత్రి తలసాని అండదండలు:మర్రి - marri shashidhar reddy fire on minister talasani
సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లోని నీలం బాలయ్య దొడ్డి, సిద్ది లింగేశ్వర స్వామి ఆవరణలో ఇల్లు కూల్చేసిన ప్రాంతాన్ని మర్రి శశిధర్‌రెడ్డి సందర్శించారు. కొంతమంది మోసపూరితంగా నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని మర్రి ఆరోపించారు.
MARRI SHASHIDHAR REDDY VISIT MONDA MARKET
100 ఏళ్ల క్రితం లింగేశ్వర స్వామి జీవ సమాధి అయిన పవిత్రస్థలమని మర్రి పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతితో గుడి నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. తప్పుడు పత్రాలతో వచ్చి కూల్చివేసిన వారిపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.