తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రతిపక్షాలపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదు: మర్రి శశిధర్​రెడ్డి - ప్రభుత్వంపై మండిపడిన మర్రి శశిధర్​రెడ్డి

ప్రతిపక్షాలపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదని కాంగ్రెస్​ నేత మర్రి శశిధర్​రెడ్డి మండిపడ్డారు. మాజీ ప్రధాని పీవీ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళితే పోలీసులు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Marri Sashidhar Reddy fires on government
ప్రతిపక్షాలపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదు: మర్రి శశిధర్​రెడ్డి

By

Published : Jun 29, 2020, 6:35 AM IST

ప్రతిపక్షాలపై ప్రభుత్వం వైఖరిని కాంగ్రెస్​ సీనియర్​ నేత మర్రి శశిధర్​రెడ్డి విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళితే పోలీసులు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వయంగా సీపీతో మాట్లాడినా.. రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యక్రమమైనందున ముఖ్యమంత్రి వచ్చి వెళ్లే వరకు ఎవరినీ అనుమతించడం లేదన్నారన్నారు. పోలీసుల వైఖరిని తప్పుబట్టడం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అడ్డుకోవడమే పనిగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details