తెలంగాణ

telangana

ETV Bharat / city

రైతులకు ఒక్క పైసా బాకీ లేము: గంగారెడ్డి - రైతులకు బకాయిల చెల్లింపులు

రబీ సీజన్​కు సంబంధించిన ధాన్యం కొనుగోలు బకాయిలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు టీఎస్​ మార్క్​ఫెడ్​ ఛైర్మన్​ మార గంగారెడ్డి తెలిపారు. ఖరీఫ్​లో రైతుల కోసం ఎరువులు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

markfed chairmen maram gangareddy  press meet in markfed bhavan
రైతులకు ఒక్క పైసా బాకీ లేము: గంగారెడ్డి

By

Published : Jul 2, 2020, 3:15 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు చెల్లించాల్సిన రూ.2,360 కోట్ల బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య-టీఎస్ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గత యాసంగి సీజన్‌లో కొనుగోళ్లకు సంబంధించి 2.6 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తైనట్టు ప్రకటించారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.25 కోట్ల విలువైన పొద్దుతిరుగుడు విత్తనం, రూ. 47 కోట్ల విలువైన 18,454 మెట్రిక్ టన్నుల జొన్నలు, రూ.170 కోట్ల విలువైన 36,241 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశామన్నారు.

రైతులకు ఒక్క పైసా బాకీ లేము: గంగారెడ్డి

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో రూ.1,668 కోట్లతో 9 లక్షల 48 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేయడం... ఆల్‌ టైం రికార్ట్ అని గంగారెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతుల సౌకర్యార్థం ఎరువుల కొరత ఉత్పన్నం కాకుండా... ఇప్పటికే మార్క్‌ఫెడ్‌ నుంచి మేలో 2.04 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేసినట్టు తెలిపారు. అంతే కాకుండా మరో 2.42 లక్షల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచామని... రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.

ఇదీ చూడండి:కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్

ABOUT THE AUTHOR

...view details