పోలీసులు, బాధితులకు మధ్య వారధులుగా మార్గదర్శక్లు వ్యవహరిస్తారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో శిక్షణ పూర్తిచేసుకున్న 159 మార్గదర్శక్లకు సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గదర్శక్ల విధుల గురించి సీపీ వివరిస్తూ.. ఈ కొత్తగా శిక్షితులైన మార్గదర్శక్ లు పోలీసులకు కళ్లు, చెవులులా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
'పోలీసులకు కళ్లు, చెవులే ఈ మార్గదర్శక్లు..' - సైబరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో శిక్షణ పూర్తిచేసుకున్న 159 మార్గదర్శక్లకు సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ సీపీ మాహేశ్ భగవత్ హాజరవగా... సైబరాబాద్ సీపీ సజ్జనార్ వర్చువల్గా హాజరయ్యారు. కొత్తగా శిక్షితులైన మార్గదర్శక్ లు పోలీసులకు కళ్లు, చెవుల్లా వ్యవహరిస్తారని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
రాచకొండ కమిషనరేట్
పోలీసులకు వారి విధుల నిర్వహణలో సహాయపడుతూ.. పరిపాలనలో తమవంతు సహకారాన్ని అందజేస్తారని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ వర్చువల్గా హాజరయ్యారు. పిల్లలు, మహిళల సమస్యలను టేకప్ చేయడంలో.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ముందుంటారని కొనియాడారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న మార్గదర్శక్లను ఆయన అభినందిస్తూ.. బాధితుల గోడు పోలీసులకు చేరవేసేలా మార్గదర్శక్లు చురుకైన పాత్ర పోషించాలని సజ్జనార్ సూచించారు.