నేనూ మార్గదర్శిలో చేరాను.. ఓ మోపెడ్ కొనుక్కున్నాను అంటూ... తెలుగువారికి సుపరిచితమైన సంస్థ మార్గదర్శి చిట్‌ఫండ్.. 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1962లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో మొదలై ప్రస్తుతం 4వేల 300 మంది సిబ్బంది, 108 బ్రాంచ్‌లతో.. అగ్రగామి సంస్థగా రూపుదిద్దుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు.... తమిళనాడు, కర్ణాటకల్లోనూ మంచి పేరు సంపాదించుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్... 61వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. కస్టమర్లే దేవుళ్లు అన్న నినాదంతో..... అన్నివర్గాల ఆశలకు మార్గదర్శకత్వం చేసేలా ఉండాలన్న లక్ష్యంతో... రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థ... ఆరు దశాబ్దాలుగా దాదాపు 60 లక్షల మంది కస్టమర్లకు మంచిసేవలు అందించింది. భారతీయసంస్కృతిలో చిట్టీలు భాగమైపోయాయన్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్.. ప్రజలుకష్టపడి సంపాదించిన డబ్బుకు కేవలం గార్డియన్‌లుగా ఉండి..భద్రంగా వారికి అందించాలన్నదే తమ సంస్థ ధ్యేయమని పునరుద్ఘాటించారు.
మధ్యతరగతి ప్రజలు మొదలు కొని సినిమా రంగం, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు.... మార్గదర్శి వినియోగదారులుగా ఉన్నారని ఎండీ శైలజా కిరణ్ వివరించారు. 50 వేలు మొదలుకొని కోటి రూపాయల వరకు చిట్‌లను అందిస్తున్నట్లు వివరించారు. ప్రజల డబ్బుకు ఏ ఇబ్బంది రాకుండా ఉండేందుకే కఠినమైన రికవరీ నియమాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు.
1992లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సంస్థను.... 100 కోట్ల నుంచి 300 కోట్ల టర్నోవర్‌కు తీసుకెళ్లామని ఆ తర్వాత మార్గదర్శి ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని మార్గదర్శి ఎండీ తెలిపారు. మార్కెట్‌లో ఎంతటి పోటీ ఉన్నా సంస్థ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసమే తమను ముందుకు నడుపుతోందని వివరించారు.భవిష్యత్‌లో మరిన్ని కొత్త బ్రాంచ్‌లతో మరింత మందికి సేవలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తన్నామని శైలజాకిరణ్ వివరించారు.