తెలంగాణ

telangana

ETV Bharat / city

కొంపల్లిలో మార్గదర్శి 107వ శాఖ ప్రారంభం - margadarshi chitfund branch open in kompalli

హైదరాబాద్​లోని కొంపల్లిలో మార్గదర్శి చిట్​ఫండ్ 107వ శాఖను ఎండీ శైలజాకిరణ్​ ప్రారంభించారు. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించడమే సంస్థ ధ్యేయమని ఆమె చెప్పారు. అత్యుత్తమైన సేవలతో 57 ఏళ్లుగా ఖాతాదారుల ఆదరాభిమానాలు పొందుతున్నామని అన్నారు.

కొంపల్లిలో మార్గదర్శి 107వ ప్రారంభం
కొంపల్లిలో మార్గదర్శి 107వ ప్రారంభం

By

Published : Dec 11, 2019, 2:12 PM IST

ఖాతాదారుల సొమ్ముకు భద్రతతోపాటు వారి భవిష్యత్‌ బంగారుమయం చేసేందుకే మార్గదర్శి పనిచేస్తోందని సంస్థ ఎండీ శైలజాకిరణ్​ అన్నారు. కొంపల్లిలో 107వ శాఖను ఈనాడు ఎండీ కిరణ్​తో కలిసి ఆమె ప్రారంభించారు. ఖాతాదారులకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పరిష్కరిస్తామన్నారు. మిగతా సంస్థల కంటే ముందుగానే చిట్టీ డబ్బులు చెల్లిస్తూ... ఆదరాభిమానాలు పొందుతున్నామని చెప్పారు. 57 ఏళ్లుగా ఖాతాదారుల మన్ననలు పొందుతోన్న మార్గదర్శి... కొంపల్లిలో బ్రాంచ్​ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానికులకు అందుబాటులో ఉండాలనే ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు.

కొంపల్లిలో మార్గదర్శి-107 ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details