ఈనెల 19న ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని బొత్తలంక-పాలగూడెం గ్రామ పరిసరాల్లో పోలీసులు డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేశారని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఇది దేశ చరిత్రలో ప్రజాఉద్యమాలపై, జనావాసాలపై జరిగిన మొదటి డ్రోన్ దాడి అని వారు ఆరోపించారు. డ్రోన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లను ఆకాశంలో గమనించి ప్రజా గెరిల్లాలు తప్పించుకున్నాయని తెలిపారు. దాడిలో అడవి జంతువులు, పక్షులు, ప్రకృతి వినాశనం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రోన్ దాడులపై ప్రకటన విడుదల చేసిన మావోయిస్టులు - telangana varthalu
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీసులు డ్రోన్ల ద్వారా బాంబుదాడులు చేశారని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో అడవి జంతువులు, పక్షులు, ప్రకృతి వినాశనం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రోన్ దాడులపై ప్రకటన విడుదల చేసిన మావోయిస్టులు
కొవిడ్‌ను అరికట్టడంతో అన్ని ప్రభుత్వాలు విఫలం అయ్యాయని మావోయిస్టులు ఆరోపించారు. దండకారణ్యం-బస్తర్‌ను మోదీ, అమిత్ షాలు శత్రు దేశంగా భావిస్తున్నారని విమర్శించారు. దాడులకు వ్యతిరేకంగా ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘాలు, పార్టీలు, మేధావులు, కార్మికులు, రైతులు, విద్యార్ధులు ఈ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మావోయిస్టులు సూచించారు.
ఇదీ చదవండి: ఆస్పత్రి మెట్ల వద్ద.. భార్య ఒడిలోనే కరోనా రోగి మృతి