తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ: విశాఖ మన్యంలో మావోయిస్టుల పోస్టర్లు - visakha agency latest news

ఏపీ‌లోని విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం పరిధిలోని పలు గ్రామాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. పీఎల్జీఏ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

maoist-posters-surface-in-visakha-agency
ఏపీ: విశాఖ మన్యంలో మావోయిస్టుల పోస్టర్లు

By

Published : Nov 29, 2020, 10:50 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. పీఎల్జీఏ 20వ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్‌ పేరిట పిలుపునిచ్చారు. జి.మాడుగుల మండలం మద్ది గరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

పేర్కొన్న అంశాలు:

  • డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే మావోయిస్టుల వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి.
  • శత్రువు ముందు లొంగుబాటు బానిసత్వంతో సమానం.
  • రకరకాల ఆశలు చూపించి లొంగదీసుకునే శత్రువు కుట్రలను తిప్పి కొట్టండి.
  • యువతీ యువకులు వేలాదిగా పీఎల్జీఏలో చేరండి. భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయండి. అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వరకట్న వేధింపులతో ఏవో అరుణ ఆత్మహత్య.. తండ్రి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details