ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు సమీపంలోని నాగార్జున సాగర్ కెనాల్ వద్ద... మావోయిస్టు కంభంపాటి చైతన్య అలియాస్ సూర్యను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.10 వేలు, మలయాళీ భాషలో ఉన్న విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు కంభంపాటి చైతన్య అలియాస్ సూర్య అరెస్ట్ - maoist chaitanya aliyas surya has arrested latest updates
ఏపీలోని గుంటూరు జిల్లా కొండమోడుకు చెందిన మావోయిస్టు కంభంపాటి చైతన్య అలియాస్ సూర్యను.... పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.10 వేల నగదు, మలయాళీ భాషలో ఉన్న విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు కంభంపాటి చైతన్య అలియాస్ సూర్య అరెస్ట్
చైతన్య అలియాస్ సూర్య స్వగ్రామం గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు. పీడీఎం, పీకేఎస్, ఏపీసీల్సీ, పీకేఎం వంటి సంస్థల్లో చైతన్య క్రియాశీల పాత్ర పోషిస్తూ... కబని-1 దళంలో ఏరియా కమిటీ సభ్యునిగా పని చేశారు. గతంలో రాయలసీమ, పశ్చిమ కనుమల్లో మావో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. మావోల రిక్రూట్మెంట్లో తన వంతు పాత్ర పోషించాడని వెల్లడించారు.
ఇదీ చదవండి:వ్యవసాయేతర ఆస్తుల నమోదు వ్యాజ్యంపై స్టే పొడిగింపు