హైదరాబాద్లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే కేసుల్లో దాదాపు 80శాతానికి పైగా నగరంలోనే నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో లాక్డౌన్ విధించే యోచనలో ఉంది. ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు... హైదరాబాద్లో ఉండాలంటే భయాందోళనలకు గురవుతున్నారు.
కరోనా దెబ్బకు.. ఇళ్లు, అపార్ట్మెంట్లు ఖాళీ - కరోనాతో నగరంలో టు-లెట్లు
కరోనా విజృంభణతో... అద్దె ఇళ్లలో ఉండేవారు చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో నగరంలో ఇల్లు పెద్ద ఎత్తున ఖాళీ అవుతున్నాయి. ఏ గల్లీలో చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

కరోనా దెబ్బకు.. ఇళ్లు, అపార్ట్మెంట్లు ఖాళీ
హైదరాబాద్లో బతకలేని పరిస్థితిలో... ఉన్న ఇంటిని ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో నగరంలో అద్దె ఇళ్లు, అపార్ట్మెంట్లు పెద్ద ఎత్తున ఖాళీ అవుతున్నాయి. తార్నాక, లాలాపేట, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో... ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు దర్శనిమిస్తున్నాయి. వ్యాపారాలు సరిగా నడవక... దుకాణాదారులు కిరాయి భరించలేక ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
ఇదీ చూడండి:ఏమైందీ.. ఎమ్మెల్యేకు..? ఒకవైపు ప్రమాదం.. మరోవైపు పొగ