రాష్ట్రంలోని పలువురు పోలీసులు.. ఠాణాల్లోనే లంచం తీసుకొంటూ అనిశాకి చిక్కడం కలకలం రేపుతోంది. కొందరు పోలీసుల వల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని ఉన్నతాధికారులే అంటున్నారు. తాజాగా మియాపూర్ ఎస్ఐ యాదగిరి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పోలీస్‌స్టేషన్‌లోనే చిక్కారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఎస్ఆర్నగర్ ఎస్ఐ భాస్కర్‌రావు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాన్‌ను పట్టుకున్నారు. వాహనం తిరిగి ఇచ్చేందుకు డ్రైవర్ మహ్మద్ ఖాసీంను రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. నగదును పోలీస్‌స్టేషన్‌లోనే ఇవ్వాలని చెప్పాడు. ఎస్ఐ తీరుపై విసిగిపోయిన ఖాసీం.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
గాంధీనగర్ ఎస్ఐగా పనిచేస్తున్న లక్ష్మీ నారాయణ, కానిస్టేబుల్ నరేష్... మోసం కేసులో ఒక వ్యక్తిని తప్పిస్తామంటూ లంచం డిమాండ్ చేశారు. రూ.30 వేలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పారు. ఆ నగదు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ వారిని పట్టుకొంది.
షాబాద్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ భూ వివాదానికి సంబంధించి కేసును పరిష్కరించేందుకు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు రూ.1.20 లక్షలు ఇస్తానని అంగీకరించి.. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. లంచం సొమ్ముతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇస్తుండగా.. ఎస్ఐ, ఏఎస్ఐని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.