రష్యన్ యువతి దీనగాథపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ - భారత్లో వచ్చిన కథనాలు దాతలను కదిలించాయి. దేశవిదేశాల నుంచి పలువురు ఫోన్లు చేసి తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. రష్యన్ యువతికి దాతల సాయం
ఆధ్యాత్మిక యాత్రకు భారత్కు వచ్చి.. స్వదేశానికి వెళ్లడానికి డబ్బులు లేక తిరుపతిలో చిక్కుకున్న రష్యన్ యువతిపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. యువతికి సాయం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు.
రష్యా వెళ్లేందుకు విమాన ఖర్చులు భరించేందుకు సిద్ధమని డాట్ ట్రావెల్స్ సంస్థ ముందుకొచ్చింది. మారమ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.25 వేల సాయం ప్రకటించింది. యువతికి తక్షణ సాయంగా రూ.10 వేలు అందించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ -తుడాకు చెందిన ఓ అధికారి కుటుంబసభ్యులు ఇప్పటికే నిత్యావసరాలు అందించారు. మరో ప్రభుత్వ అధికారి రూ.10 వేలు సాయం ప్రకటించారు.
ఇదీ చదవండి: తిరుపతిలో రష్యన్ మహిళ కష్టాలు.. ఆర్థిక సమస్యలతో తల్లీకుమార్తెలు అవస్థ