హైదరాబాద్ మహానగరం త్వరలోనే.. మెడికల్ హబ్‌గా మారనుందని, ప్రతిఒక్క పరికరం తక్కువ ధరలో ఇక్కడే అందుబాటులో ఉంటుందని తెలంగాణ ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.
'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'
ప్రస్తుత కరోనా ఆపత్కాలంలో వెంటిలేటర్ల అవసరం చాలా ఉందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడమే మేలని అభిప్రాయపడ్డారు.
'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'
రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వెంటిలేటర్ల అవసరం చాలా ఉందని, వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేయడం మేలని జయేశ్ రంజన్ అభిప్రాయపడ్డారు. తక్కువ ధరలో వెంటిలేటర్లను తయారు చేసేందుకు ముందుకొచ్చిన లెవెన్ మెడికల్ సంస్థను అభినందించారు.
జూమ్ యాప్ ద్వారా ఈ సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో లెవెన్ సంస్థ సీఈఓ జాకీ ఖురేషీ, సీఐఎస్ఎఫ్ దక్షిణ భారత విభాగం అధికారిణి అంజనా సిన్హా పాల్గొన్నారు.
Last Updated : Aug 17, 2020, 2:07 PM IST