ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది మినీ హార్బర్‌లో ఆదివారం వింత రొయ్య అబ్బురపరిచింది. అక్కడ 510 గ్రాముల బరువున్న మాంటీస్ ష్రింపు(మాంటీస్ రొయ్య) దర్శనమిచ్చింది. స్థానిక మత్స్యకారుల వలకు ఈ రొయ్య చిక్కింది.
కాంతులు వెదజల్లే రొయ్య.. చూస్తే ఔరా అనాల్సిందేనయ్య! - అంతర్వేదిలో మాంటీస్ రొయ్య వార్తలు
ఇది చూడటానికి అచ్చం పురుగులాగానే కనిపిస్తోంది కదా! అలా అనుకుంటే పొరపాటే మరి. అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న రొయ్య. దీనిపేరు మాంటీస్ ష్రింపు (మాంటీస్ రొయ్య).. ఈ రొయ్య కళ్ల నుంచి కాంతులు వస్తాయి. ఇది అరుదుగా దొరుకుతుందని స్థానికులు చెప్తున్నారు. ఏపీలోని అంతర్వేది మినీ హార్బర్‌లో ఈ రొయ్య దర్శనమిచ్చింది.

మాంటీస్ రొయ్య
ఒకప్పుడు విరివిగా లభించినా, ప్రస్తుతం అరుదుగా దొరుకుతుందని, ఇది తేలు మాదిరిగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ రొయ్యకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర ఉంటుందని.. దీని కళ్ల నుంచి కాంతులు వెదజల్లుతుందని మత్స్యశాఖ ఏడీ కృష్ణారావు చెప్పారు.